Sasikala sensational comments: తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..బహిష్కృత పార్టీ మళ్లీ ఆమెకు దక్కనుందా. ఏం జరగబోతోంది. జైలు నుంచి విడుదలై తొలిసారి చెన్నై వచ్చిన సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళనాడు ( Tamilnadu ) మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ( Jayalalitha )నెచ్చెలిగా , తమిళనాట చిన్నమ్మగా ప్రఖ్యాతి పొందిన శశికళ ( Sasikala ) ఇప్పుడు రాజకీయల్లో వేడి పుట్టిస్తున్నారు. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం బెంగళూరు జైలు ( Bengaluru jail ) నుంచి విడుదలై తొలిసారి చెన్నై ( Sasikala return to chennai )కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు భారీగా స్వాగతం పలికారు. హోసూర్ నుంచి చెన్నై మార్గంలో ఏడు జిల్లాల ద్వారా ఆమె యాత్ర సాగింది. తిరుపత్తూరు జిల్లాలో శశికళకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు కూడా అన్నాడీఎంకే ( AIADMK ) జెండాలతో ఆహ్వానం పలికారు. ముందుగా స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు శశికళ. ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి.  


ఆమె ప్రసంగం కూడా ఏఐఏడీఎంకే ( AIADMK ) పార్టీ గురించే సాగింది. పార్టీ చాలా పోరాటాలు చేసిందని..ఫీనిక్స్ పక్షిలా ఉద్భవించిందని శశికళ ( Sasikala ) తెలిపారు. ఉమ్మడి శత్రువును ఓడించడానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కారుకు ఏఐఏడీఎంకే జెండాను పెట్టుకోవడాన్ని శశికళ సమర్ధించుకున్నారు. పార్టీ జెండా వాడటంపై ఫిర్యాదులు చేసేవారు..తనను చూసి భయపడుతున్నారన్నారు. జయలలిత వారసురాలు తానేనని చెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్తారా అనే ప్రశ్నకు..ఏం జరుగుతుందో వేచి చూడండి అంటూ సమాధానమిచ్చారు. ఆమె వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో( Tamil politics )వేడి పుట్టిస్తున్నాయి. ఏదో జరగబోతుందనే సంకేతాల్ని ఇస్తున్నాయి. పార్టీని తిరిగి చేజిక్కించుకుంటారనే వాదన విన్పిస్తోంది. 


Also read: Farmers protest and tweets: సచిన్, కోహ్లీ, తదితరుల ట్వీట్స్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook