SBI Bank Holidays 2020: ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..
అసలే దేశ వ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ టైమ్ నడుస్తోంది. బ్యాంకు ఖాతాదారులు ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవురోజులు (SBI Bank Holidays 2020 April) తెలుసుకోవడం ఉత్తమం.
అసలే కరోనా వైరస్ కష్టకాలం నడుస్తోంది. మీకు ఈ నెలలో బ్యాంకులో ఏమైనా పని ఉందా.. అయితే ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుదినాలు (Bank Holidays In April) తెలుసుకుని మీ పనను చక్కబెట్టుకోంది. లాక్‌డౌన్ నడుస్తోంది కనుక తొలి 14 రోజులు బ్యాంకు పనులు మందగించే అవకాశం ఉంది. గతంతో పోల్చితే లాక్‌డౌన్ సమయంలో మధ్యాహ్నం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. బ్యాంకు సెలవులను దృష్టిలో ఉంచుకుని నగదు జమ చేయడం, చెక్ డిపాజిట్, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) పనులకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత.. మార్చి నుంచే అమలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో బ్యాంకుల సెలవుదినాలు ఇలా ఉండనున్నాయి. నాలుగు ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లో బ్యాంకులకు సెలవు. రెండో, నాలుగో శనివారాలైన 11, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులకు సెలవు కనుక బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ సెలవుదినాలపై బ్యాంకు ఖాతాదారులకు స్పష్టత ఉంటుంది. వీటితో పాటు అదనపు సెలవు దినాలపై ఓ లుక్కేయండి. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
ఏప్రిల్ 2న శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఈ నెల తొలి గురువారం నాడు బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 10న రోజున గుడ్ ఫ్రైడే, ఇంకా ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఏప్రిల్‌లో ఈ సెలవులు వర్తిస్తాయి. వీటితో పాటు ఒక్కో రాష్ట్రంలో వారి ముఖ్యమైన రోజులలో సెలవులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కస్టమర్లకు ఏ ఇబ్బంది ఉండదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ
బుల్లితెర భామ టాప్ Bikini Photos