కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.  పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019పై దేశవ్యాప్తంగా రగడ  కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో  CAA-2019 చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రానికి సూచించే విధంగా సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లు సుప్రీం ధర్మాసనం ఈ రోజు విచారణకు స్వీకరించింది. ఐతే ఈ రోజు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య ధర్మాసనం .. CAA-2019 చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఐతే అన్ని పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనానికి సూచించింది. మరోవైపు ఈ కేసులో నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  
అంతే కాదు అసోం, త్రిపురకు సంబంధించిన విషయాలపై ప్రత్యేకంగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆయా అంశాలను గుర్తించేందుకు సహకరించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కు సుప్రీం ధర్మాసనం సూచించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..