Madhya Pradesh: ఓ టీచర్(School Teacher) చేసిన పని విద్యార్థుల తల్లిదండ్రులను షాక్ కు గురిచేసింది. ఐదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్(5th class whatsapp group)లో ఫోర్న్ వీడియో లింక్(Porn Video Link) షేర్ చేయడమే ఇందుకు కారణం. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రీవా(rewa)లో చోటుచేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ పాఠశాల(Govt School) ఐదో తరగతి వాట్సాప్ గ్రూప్​లో జిల్లాలోని 28 స్కూళ్లకు చెందిన 180మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు 65 మంది మహిళా టీచర్లు సభ్యులుగా ఉన్నారు. ఫోర్న్ లింక్ షేర్ చేసిన టీచర్ కృపాకర్ చతుర్వేదిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ గ్రూప్​లో కృపాకర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 30మంది ఉన్నారు. 


Also Read: షాకింగ్: స్కూల్ బస్సు మిస్​ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య!


ఇలా చేయడం కొత్తం కాదు:
ఆశ్లీల లింక్ షేర్ చేసిన కాసేపటికి దాన్ని తొలగించాడు కృపాకర్. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్షమాణలు చెప్పాడు. అయితే కృపాకర్​ ఇలా చేయడం కొత్తేం కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి లింక్​లు షేర్ చేశాడని గ్రూప్​లోని మరో టీచర్ ఆరోపించారు. అతడ్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కృపాకర్​పై తమకు ఫిర్యాదు(Complaint) అందిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook