Schools, Colleges closed in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు నానాటికి భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్టు శుక్రవారం ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. తరువాతి ఆదేశాలు వెలువడే వరకు ఢిల్లీలో స్కూల్స్, కాలేజీలు మూసే ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టంచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులకు చెక్ పెట్టేందుకు ముందుగా మైక్రో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసిన ఢిల్లీ సర్కార్ ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతటితో కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో తాజాగా విద్యా సంస్థలను సైతం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. 


Also read : Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. ఏది బెటర్ ?


లాక్‌డౌన్ దిశగా.. ?
ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే.. లాక్ డౌన్ విధిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే, ఢిల్లీ సర్కార్ మాత్రం ఢిల్లీలో లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించే ఉద్దేశమే లేదని తేల్చిచెబుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ''కరోనావైరస్ కేసులకు చెక్ పెట్టడానికి లాక్ డౌన్ ఒక్కటే సరైన పరిష్కారం కాదు కనుక లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ప్రభుత్వం లేదు'' అని స్పష్టంచేశారు. ఆ తర్వాతే ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ (Night curfew in Delhi) విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook