Jammu kashmir Encounter: జమ్ము సైనిక స్థావరంపై జరిగిన ద్రోన్ దాడితో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కశ్మీర్‌లో వరుసగా ద్రోన్ లు కన్పిస్తుండటంతో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో భద్రతాబలగాలకు సాఫల్యం లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జమ్ము సైనిక స్థావరంపై (Jammu Military Base)మొన్న శనివారం నాడు జరిగిన ద్రోన్ దాడి(Drone Attack) ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పట్నించి ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ద్రోన్‌లు కన్పిస్తుండటం మరింత ఆందోళనగా మారింది. వరుసగా నాలుగవరోజు సరిహద్దు ప్రాంతంలో ద్రోన్‌లు కన్పించాయి. ఇవాళ ఉదయం 4 గంటల 40 నిమిషాలకు కాలూచక్ ప్రాంతంలో ద్రోన్ కన్పించగా..మరొకటి కంజావని ప్రాంతంలో కన్పించింది. దాంతో భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. కుల్గామ్ సమీపంలోని చిమర్ ప్రాంతంలో భద్రతాబలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.ఈ ఎన్‌కౌంటర్‌(Encounter)లో ఇద్దరు టెర్రరిస్టులు (Terrorists shot dead)హతమయ్యారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిసింది.


Also read: Uttar pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకై రంగంలో దిగిన ప్రియాంక గాంధీ, లక్నోలో బస


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook