Sebi Recruitment 2024: సెబీ రిక్రూట్మెంట్ 2024.. రూ. 90,000 జీతంతో ఉద్యోగం.. ఇలా అప్లై చేసుకోండి..
Sebi Recruitment 2024: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 2024 దరఖాస్తునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకునే విధానం, అభ్యర్థులకు కలిగి ఉండాల్సిన తదితర వివరాలు తెలుసుకుందాం.
Sebi Recruitment 2024: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 2024 దరఖాస్తునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లై చేసుకునే విధానం, అభ్యర్థులకు కలిగి ఉండాల్సిన తదితర వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్ జాబుల కోసం ఎదురు చూసే అభ్యర్థులకు బంపర్ ఆఫర్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మీకోసమే. సెబీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024 మార్చి 14న మేనేజర్ పోస్టులకు సంబంధించి భర్తీకి దరఖాస్తులకు స్వీకరిస్తోంది. ఈ పరీక్షలో పాసైన అభ్యర్థులకు భారీ జీతం అందించనుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ జనరల్, ఐటీ, లీగల్, ఇంజినీరింగ్ భాషా విభాగాల్లో మేనేజర్ పోస్టులు నియమించాల్సి ఉంటుంది.
సెబీ ఆఫీసర్ గ్రేడ్ A పోస్టులకు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ Sebi.gov.in ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ విధానం 2024 ఏప్రిల్ 13 చివరి తేదీ. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, లా డిగ్రీ, ఇంజినీరింగ్ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అధికారిక వెబ్‌సైట్ క్షుణ్నంగా చదివి అప్లై చేసుకోగలరు.
ఇదీ చదవండి: ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు, తొలిసారి ఓట్ ఫ్రం హోం
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2024 మార్చి 31 నాటికి 30 ఏళ్ల వయస్సు మించకూడదు. ఇంకా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. సెబీ అధికారిక వెబ్‌సైట్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్ట్ అప్లికేషన్ దరఖాస్తుకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.100 ఇన్ఫర్మేషన్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
ఇదీ చదవండి: దేశంలో 7 దశల్లో ఎన్నికలు, ఏ దశలో ఎప్పుడెప్పుడు తేదీలు ఇలా
ఎంపిక ప్రక్రియ..
ఈ రిక్రూట్మెంట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో పూర్తవుతుంది. దీంట్లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మళ్లీ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. చివరి దశ ఇంటర్వ్యూ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook