Delhi reports second case of Omicron variant: కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కొత్త వేరియంట్‌ 'ఒమిక్రాన్‌' (Omicron ) ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా (South Africa)లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌.. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్‌ రోజురోజుకు పంజా విసురుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రెండో కేసు నమోదైంది. జింబాంబ్వే (Zimbabwe) నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకింది. దాంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 30 దాటింది. ఢిల్లీ కేసుతో కలుపుకుని దేశంలో కేసుల సంఖ్య 33కు చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల జింబాంబ్వే (Zimbabwe) నుంచి వచ్చిన 35 వ్యక్తి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా.. అతడికి ఒమిక్రాన్‌ సోకిందని వెల్లడైంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ (Delhi Government) అధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. 'ఢిల్లీలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ రెండో కేసు నమోదైంది. ఆ వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకుని జింబాబ్వే నుంచి వచ్చాడు. అతడు దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణన్ (LNJP) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. కేవలం బలహీనత మాత్రమే ఉంది' అని సదరు అధికారి వెల్లడించారు. 


Also Read: ఈ ప్రెగ్నన్సీ నీ వల్ల రాలేదని ఎలా చెప్పగలను.. బాంబ్ పేల్చిన ప్రముఖ లేడీ కమెడియన్! షాక్ తిన్న భర్త!!


ఢిల్లీలో నమోదైన రెండో ఒమిక్రాన్‌ (Omicron) కేసు ఇది. ఇప్పటికే తాంజానియా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకింది. అతడు కూడా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణన్ (LNJP) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరిన విదేశీ ప్రయాణికుల్లో 27 మంది నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అందులో 25 మందికి నెగటివ్ రాగా.. ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో రెండో కేసు నమోదవడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవవుతున్నారు. 


Also Read: LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్​బ్యాక్- పే లేటర్ ఆప్షన్​ కూడా!


మరోవైపు మహారాష్ట్రలో (Maharashtra) ఒమిక్రాన్‌ కలకలం రేపుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. ఒమిక్రాన్‌ సోకిన వారిలో నలుగురికి లక్షణాలు లేవని, ముగ్గురిలో స్వల్ప లక్షణాలు కన్పించినట్లు అధికారులు తెలిపారు. కొత్త కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర అధికారులు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. దేశంలో (India) ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య 33కు చేరింది. మహారాష్ట్రలోనే అత్యధికంగా 17 కేసులు నమోదవడం విశేషం.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook