LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్​బ్యాక్- పే లేటర్ ఆప్షన్​ కూడా!

LPG Booking Offer: పేటీఎంలో వంట గ్యాస్ బుక్​ చేసుకుంటే భారీ తగ్గింపు, కచ్చితమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2021, 11:59 AM IST
  • వంట గ్యాస్ ధరల భారం తగ్గించే పేటీఎం డీల్స్​
  • కచ్చితమైన క్యాష్​ బ్యాక్​తో ఆఫర్లు
  • అందుబాటులోకి.. పే లేటర్​ సదుపాయం
LPG Booking Offer: పేటీఎంలో గ్యాస్ బుక్ చేస్తే రూ.2700 క్యాష్​బ్యాక్- పే లేటర్ ఆప్షన్​ కూడా!

LPG Booking Offer: ఇటీవలి కాలంలో వంట గ్యాస్ ధర క్రమంగా పెరుగుతూ సామాన్యులకు (LPG price hike) భారంగా మారాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ తక్కువ ధరకే సిలిండర్ బుక్​ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. మరి ఆదేలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

ఆఫర్ వివరాలు ఇలా..

పేటీఎం ద్వారా సిలిండర్​ బుక్ చేసుకుంటే అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్ పొందే వీలుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. రూ.2,700 వరకు ఈ ఆఫర్ ద్వారా ఆదా చేయొచ్చు.

ఈ ఆఫర్ మూడు ప్రధాన ఎల్​పీజీ గ్యాస్ సర్వీసులందించే కంపెనీలైన హెచ్​పీ, భారత్​, ఇండెన్​ గ్యాస్​లకు వర్తిస్తుంది. '3 పే 2700' ఆఫర్​లో భాగంగా ఈ క్యాష్​ బ్యాక్ (Paytm offer on LPG booking) పొందొచ్చు.

తాజాగా మూడు సిలిండర్లు బుక్ చేసుకుంటే.. రూ.3000 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్​ను కూడా అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. ఇందులో కనీసం రూ.900 కచ్చితమైన క్యాష్​ బ్యాక్​ ఆఫర్​ అందుబాటులో (Paytm Cashback offers) ఉంచింది.

మరిన్ని ప్రయోజనాలు..

దీనితో పాటు వినియోగదారులు ఎవరైతే అనివర్య కారణాల వల్ల బుకింగ్ బిల్లు చెల్లించలేకపోతే.. పే లేటర్ ఆఫ్షన్​ను కూడా అందిస్తోంది. పే లేటర్ ఆప్షన్ ఎంచుకుంటే.. వచ్చే నెలలో ఆ బిల్లును పే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పేటీఎం 'పోస్ట్ పేయిడ్​' సేవలు (Paytm Pay later service) అందిస్తోంది.

వీటితో పాటు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏజెన్సీకి వెళ్లకుండానే గ్యాస్ బుక్ చేసుకునే వీలు కలుగుతోంది. దీని ద్వారా సులభంగా గ్యాస్ హోం డెలివరీ పొందొచ్చు.

Also read: SBI personal loan : సులువుగా పర్సనల్ లోన్, నిమిషాల్లో అకౌంట్లో డబ్బు జమ, ప్రాసెసింగ్ ఫీజు లేదు..

Also read: EPFO : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News