Rahul Gandhi Security Lapse: పంజాబ్‌లో మరోసారి భద్రతా లోపం- ఈ సారి రాహుల్ గాంధీకి..
Rahul Gandhi Security Lapse: పంజాబ్‌లో మరోసారి భద్రత లోపం వెలుగు చూసింది. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ కారుపై జెండా విసిరాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi Security Lapse: వీవీఐపీల సెక్యూరిటీలో మరోసారి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. గత నెల ఆరంభంలో పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటన మరవక ముందే.. మళ్లీ పంజాబ్‌లోనే.. మరోసారి భద్రత లోపం బయటపడింది.
అయితే ఈ సారి భద్రతా లోపం ఘటన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కాన్వాయ్కి ఎదురైంది.
ఇంతకీ ఏమైందంటే..
పంబాజ్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ కారుపై ఓ యువకుడు జెండా విసిరాడు. అది కాస్త రాహుల్ గాంధీ ముఖానికి తగిలినట్లు తెలిసింది. ఈ ఘటనతో రాహుల్ గాంధీ కారు అద్ధం మూసేసి అక్కడి నుంచి మందుకు కదిలి వెళ్లారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన కోసం పర్యట..
పంజబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు ఆదివారం లుధియానా వెళ్లారు రాహుల్ గాంధీ. ఈ సమయంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు అభివాదం చేసేందుకు రాహుల్ కారు అద్దం దించారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి ఆయన ప్రయాణిస్తున్న కారుపై జెండా విసిరాడు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన సందర్భంగా ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు మౌనం పాటించినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం బయటకు వచ్చాయి. జెండా విసిన వ్యక్తి కశ్మీర్‌కు చెందిన ఎన్ఎస్యూఐ కార్యర్తగా గుర్తించారు అధికారులు.
గత నెల 5న ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డగించి కొంత మంది నిరసన వ్యక్తం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఇక ఇటీవలే యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి బయల్దేరి వస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధిన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also read: Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ ప్రకటన- మరోసారి చన్నీకే అవకాశం
Also read: Assembly Elections: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం, ఆ సభలకు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook