Punjab Elections: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై అధిష్ఠానం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ప్రస్తుత సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీనే తమ సీఎం అభ్యర్థికగా ప్రకటించారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేఫథ్యంలో ఆదివారం పంజాబ్‌లోని లుథియానాలో పర్యటించారు రాహుల్ గాంధీ. ఇందులోనే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా ప్రకటన చేశారు.
పంజాబ్ ముఖ్య మంత్రి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. పంజాబ్ ప్రజల సూచన మేరకు.. బలహీన వర్గాల సమస్యలను అర్థం చేసుకునే.. కింది స్థాయి నుంచి వచ్చిన నేతను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
చన్నీ పేద కుటుంబం నుంచి వచ్చాడని. అతను పేదరికం కష్టాల గురించి తెలుసన్నారు రాహుల్.
ఈ ప్రకటనపై చరణ్‌జిత్ సింగ్ చన్నీ స్పందించారు. తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంపై రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపాడు. ఆయన (రాహుల్ గాంధీ) వల్ల ఓ పేదవాడు సీఎం అయ్యాడని పేర్కొన్నారు.
తాను ఈ యుద్ధంలో (ఎన్నికల్లో) ఒక్కడినే పారాడలేనని.. తన వద్ద అంత డబ్బు, ధైర్యం లేదని పేర్కొన్నారు చన్నీ. పంజాబ్ ప్రజలు ఈ యుద్ధంలో పోరాడుతారని తెలిపారు.
Also read: India Covid-19 Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు
Also read: Himachal Pradesh snow: మంచు కురిసే వేళలో.. హిమాచల్ అందాలు చూద్దామా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook