Vinay Mohan Kwatra: భారత విదేశాంగ శాఖ 34వ కార్యదర్శిగా వినయ్‌ క్వత్రా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు విదేశాంగశాఖ సెక్రటరీగా పనిచేసిన హర్షవర్ధన్‌ శనివారం రిటైర్డ్‌ అయ్యారు. ప్రధాని యూరోప్‌ పర్యటనకు ఒక రోజు ముందే వినయ్‌ క్వత్రా బాధ్యతలు చేపట్టాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాయిస్: 1988 బ్యాచ్‌ కు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి వినయ్‌ క్వత్రాకు విదేశాంగశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టకముందు ఆయన.. నేపాల్‌ లో భారత రాయబారిగా పనిచేశాడు. 2020 ఫిబ్రవరి నుంచి నేపాల్‌ లోనే రాయబారిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2018 ఆగస్టు నుంచి ఫిబ్రవరి 2020 వరకు ఫ్రాన్స్‌ లో భారత అంబాసిడర్‌ గానూ పనిచేశాడు. 2015 అక్టోబర్‌ నుంచి ఆగస్టు 2017 వరకు ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీ హోదాలో పనిచేశాడు. విదేశాంగశాఖలోని కీలక విభాగమైన పాలసీ ప్లానింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ లోనూ వినయ్‌ క్వత్రా పనిచేశాడు.విదేశాంగశాఖలోని అమెరికన్‌ డివిజన్‌ కు హెచ్‌వోడీగా పనిచేసిన క్వత్రా అమెరికా, కెనడా దేశాలతో భారత్‌ సంబంధం బలపేతానికి విశేష కృషి చేశారు.


వాయిస్: నూతన విదేశాంగ కార్యదర్శిగా ఛార్జ్‌ తీసుకున్న వినయ్‌ క్వత్రా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఉక్రెయిన్‌ పరిస్థితులు, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ఆప్ఘనిస్తాన్‌ లో నెలకొన్న పరిస్థితులను ఇప్పటివరకు భారత్‌ నిశితంగా గమనిస్తూ వస్తోంది. పొరుగుదేశాలతో సంబంధాలు దెబ్బతినకుండా చాకచాక్యంగా పనిచేయాల్సి ఉంటుంది. క్వత్రాకు పొరుగుదేశాలతో చర్చలు జరపడంలో మంచి పేరు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయన సమర్ధుడే కాదు.. యూఎస్‌, చైనా, యూరోప్‌ దేశాలతో భారత మైత్రి మరింత మెరుగుపరుస్తారని ఆశిస్తున్నారు. నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వినయ్‌ కి విదేశాంగ టీం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. ఈ మేరకు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్వీట్‌ చేశాడు.


వాయిస్: ఇక శనివారం రిటైర్డ్‌ అయిన హర్షవర్ధన్‌ భారత 33వ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశాడు. జనవరి 2020లో బాధ్యతలు తీసుకున్న ఆయన.. ఏప్రిల్‌ 30 2022 వరకు ఆ పదవిలో కొనసాగారు. విదేశాంగ కార్యదర్శిగా ఛార్జ్‌ తీసుకోకముందు ఆయన అమెరికా, థాయ్‌ లాండ్‌లో భారత అంబాసిడర్‌ పనిచేశాడు. బంగ్లాదేశ్‌ లోనూ భారత హైకమిషనర్‌గా ఆయన పనిచేశాడు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి( మే2) యూరోప్‌ లో పర్యటిస్తారు. జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో మూడు రోజుల పర్యటన ఉండనుంది. ఈ టూర్‌ తో భారత్‌- యూరోప్‌ దేశాల మధ్య బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. విదేశాంగశాఖ కార్యదర్శి హోదాలో వినయ్‌ క్వత్రాకు ఇదే తొలివిదేశీ పర్యటన కానుంది.


Also Read: Bengal Tiger Named As Prabhas: జూలోని ఆ టైగర్‌కు ప్రభాస్ పేరు..!


Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.