ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1,240.45 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ల బిఎస్ఈ 3.57 శాతం క్షీణించి 33,516.71 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 369.60 పాయింట్లు పడిపోయి 10,296.90 వద్ద ముగిసింది. నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల 40 వేల కోట్లు హరించుకుపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్ పది శాతం మేరకు నష్టాన్ని చవిచూసింది. మారుతి సుజుకీ, హెచ్ డీ ఎఫ్ సీ,  రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ మూడు నుంచి ఏడు శాతం మేరకు నష్టాల్లో నడుస్తున్నాయి. 


డిసెంబరు 2017 తర్వాత భారత రూపాయి విలువ క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ కూడా భారీగా 29 పైసలు బలహీనపడి 64.36 వద్ద ప్రారంభమైంది. 


దేశీయ స్టాక్ మార్కెట్లపై అమెరికా మార్కెట్ల ప్రభావం స్పష్టంగా పడింది. అమెరికాలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో ఆందోళన నెలకొంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయనే ఆందోళనతో అక్కడి మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ ప్రభావం భారత్‌ సహా ఆసియా దేశాలపై ఉంటుందని విశ్లేషకులు తెలిపారు.