Sensex down : కరోనా దెబ్బకు `బేర్`మన్న సెన్సెక్స్
కరోనా వైరస్ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. `కరోనా వైరస్` కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. చైనా సహా అన్ని దేశాల్లో కరోనా వైరస్ కారణంగా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO `కరోనా వైరస్`ను హెల్త్ ఎమర్జెన్సీగా నిర్ణయించింది.
కరోనా వైరస్ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. 'కరోనా వైరస్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. చైనా సహా అన్ని దేశాల్లో కరోనా వైరస్ కారణంగా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO 'కరోనా వైరస్'ను హెల్త్ ఎమర్జెన్సీగా నిర్ణయించింది.
కరోనా వైరస్ అతి పెద్ద ఉపద్రవంగా గుర్తించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో నైరాశ్యం నెలకొంది. ఇటు భారతీయ స్టాక్ మార్కెట్లపైన కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభం కాక ముందే.. అంటే ప్రీ మార్కెట్ లోనే ఈక్విటీలు భారీగా నష్టాలను చవి చూశాయి. 34 వేల 472 పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్చేంజీ ..BSE సెన్సెక్స్ దాదాపు 1664 పాయింట్లు కోల్పోయింది. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజీ..NIFTY కూడా 9 వేల 958 దగ్గర ప్రారంభమై 499 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఈ రోజు మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.
Read Also: ఛీ..ఛీ.. మీ తెలివి తెల్లారినట్టే ఉంది.. !!
మరోవైపు నాస్ డాక్ 392 పాయింట్లు కోల్పోయింది. యూరోపియన్ షేర్ మార్కెట్ల 14 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇక ఆసియాలో జపాన్ నిక్కీ 4 శాతం దిగజారిపోయింది. ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లలో 2.8 శాతం తగ్గుదల కనిపించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..