Covishield: కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం ఫిక్స్ అయింది. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనుగోలుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ ధర ఎంతంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) మరో ఐదు రోజుల్లో దేశంలో ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ( Central Government ) కీలక చర్యలకు దిగింది. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ( Covishield ) కొనుగోలు కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కేంద్ర ప్రభుత్వం డీల్ కుదుర్చుకుంది. ఇప్పటికే ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం, సీరమ్ సంస్థ మధ్య ఒప్పందం ఖరారైంది. ఇక పంపిణీకు సంబంధించి తుది ఒప్పందం జరగనుంది. డీల్ అనంతరం వ్యాక్సిన్ ధర కేవలం 2 వందల రూపాయలుంటుందని సీరమ్ వర్గాలు తెలిపాయి. మొత్తం 11 మిలియన్ వ్యాక్సిన్‌లను అందించనున్నట్టు సీరమ్ కంపెనీ తెలిపింది. జనవరి 11 నుంచి వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమవుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ) ప్రకటించింది. 


ఇప్పటికే అత్యవసర వినియోగం కోసం కోవిషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్ ( Bharat Biotech ) వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్‌లకు డీసీజీఐ ( DCGI ) అనుమతి లభించింది. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. తొలి ప్రాధాన్యత కింద 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్క( ర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ ఏడాది జూలై నాటికి 30 కోట్లమందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Also read: EPFO Pension: మీరు ఈపీఎఫ్ పెన్షనర్లైతే..బతికున్నట్టు రుజువు చేసుకోవల్సిందే..ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook