EPFO Pension: మీరు ఈపీఎఫ్ పెన్షనర్లైతే..బతికున్నట్టు రుజువు చేసుకోవల్సిందే..ఇలా

  • Jan 11, 2021, 19:22 PM IST

 

EPFO Pension: ఒకవేళ మీరు ఈపీఎఫ్ఓ కార్యాలయంలో మీరు బతికున్నట్టుగా ధృవీకరించే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించపోతే..ఇంకో గడువు తేదీ ఉంది మీకు. ఆ తారీఖులోగా మీరు ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే..మీ పెన్షన్ ఆగిపోతుంది మరి. 

1 /5

ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఏ బ్యాంకులో అయితే పెన్షన్ వస్తుందో..అక్కడ్నించి కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ఓకు చెందిన 135 రీజనల్ కార్యాలయాలు, 117 ఆఫీసులను కూడా సంప్రదించవచ్చు.

2 /5

పెన్షనర్లు ఇంట్లో కూర్చునే...http://locator.csccloud.in/ ద్వారా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ వద్ద తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో నుంచి పోస్టాఫీసుకు ఆన్‌లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. దీనికోసం http://ccc.cept.gov.in/covid/request.aspx లింక్‌ను క్లిక్ చేయవచ్చు.

3 /5

ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కాస్త ఇబ్బందైన పనే. అందుకే ఈపీఎఫ్ వేర్వేరు ఏర్పాట్లు చేసింది. లైఫ్ సర్టిఫికేట్ దేశవ్యాప్తంగా 3.65 లక్షల కామన్ సర్వీస్ సెంటర్, 1.36 లక్షల పోస్ట్ ఆఫీసులు, 1.90 లక్షల పోస్ట్‌మ్యాన్, గ్రామీణ పోస్టాఫీసుల ద్వారా సమర్పించవచ్చు.

4 /5

ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ కింద 35 లక్షల పెన్షనర్లు ఉన్నారు. వీరంతా 2020 నవంబర్ నాటికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది.  కానీ గత ఏడాది కరోనా భయంతో అన్ని పనులు నిలిచిపోయున్నాయి. అందుకే ఈపీఎఫ్ఓ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఫిబ్రవరి 28లోగా మీరు బతికున్నట్టు లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేయాల్సి ఉంది.

5 /5

మీకు పెన్షన్ ఒకవేళ ఈపీఎఫ్ నుంచి వస్తుంటే..ఈ వార్త మీ కోసమే. ఒకవేళ మీరు ఈపీఎఫ్ కార్యాలయంలో మీరు బతికున్నట్టు గత యేడాది సర్టిఫికేట్ ఇచ్చి ఉండకపోతే..మీకు మరో చివరి అవకాశం లభిస్తోంది. ఆ గడువులోగా మీరు ఒకవేళ బతికున్నట్టుగా సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ పెన్షన్ కట్ అయిపోతుంది.