COVISHIELD 3rd phase clinical trials in India: న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ కోసం ( coronavirus vaccine ) ఫార్మ దిగ్గజ కంపెనీలన్నీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో కోవీషీల్డ్ టీకా మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వహించేందుకు ఎన్‌రోల్‌మెంట్ ప్ర‌క్రియ పూర్తి అయిన‌ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్ (ICMR) సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) గురువారం పేర్కొన్నాయి. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్ధతో క‌లిసి‌ సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఐసీఎంఆర్ సాయంతో కోవావాక్స్ (COVOVAX ) టీకాను కూడా అభివృద్ధి చేస్తోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు కోవీషీల్డ్ త‌యారీకి అయ్యే ఇత‌ర ఖ‌ర్చుల‌ను సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఫండిగ్ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలోని 15 ప్రాంతాల్లో కోవీషీల్డ్ టీకా రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. ఈ ప్రయోగ పరీక్షలను సీర‌మ్‌, ఐసీఎంఆర్‌ నిర్వ‌హిస్తున్నాయి. అక్టోబ‌ర్ 31వ తేదీ నాటికే 1600 మందిని ఎన్‌రోల్ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. Also read: Adah Sharma: అందంతో ఆకట్టుకుంటున్న ఆదా..


ఇదిలాఉంటే.. సీరమ్ సంస్థ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫ‌ర్డ్‌ యూనివర్సిటీ కోవిడ్ టీకాను ఉత్పత్తి చేసే బాధ్యతను అంతకుముందు దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీరమ్ ఉత్పత్తి ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. అయితే ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పలు దేశాల్లో జరుగుతున్నాయి.  Also read: Kajal, Gautam honeymoon pics: హనీమూన్‌‌లో కొత్త జంట.. కాజల్, కిచ్లు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe