Covishield new price: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే..మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్..కోవిషీల్డ్ ధరలపై మరో ప్రకటన చేసింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదార్ పూణావాలా ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccination) ప్రక్రియ కొనసాగుతోంది.ఇప్పటివరకూ 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.ఇప్పటి వరకూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute), భారత్ బయోటెక్ (Bharat Biotech) కంపెనీల్నించి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందించింది. మే 1వ తేదీ నుంచి పరిస్థితి మారుతుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలు 50 శాతం డోసుల్ని కేంద్రానికిచ్చి..మిగిలినవాటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోనున్నాయి. దీని ప్రకారం ఒక్కొక్క డోసు ధర అంటే రాష్ట్ర ప్రభుత్వాలకైతే 4 వందల రూపాయలుగా..ప్రైవేట్ ఆసుపత్రులకైతే 6 వందల రూపాయలుగా సీరమ్ ఇనిస్టిట్యూట్ నిర్ణయించింది. కేంద్రానికి (Central government) మాత్రం ఒక్కొక్క డోసును 150 రూపాయలకే ఇస్తోంది.


ఒకే కంపెనీ వ్యాక్సిన్ వివిధ ధరలకు విక్రయించడంపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ ధర ( Covishield price) విషయంలో మరో ప్రకటన చేసింది.కోవిషీల్డ్ ధరను 4 వందల రూపాయల్నించి 3 వందలకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ధరలో వంద రూపాయలు కంపెనీ తగ్గించింది.రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీఈవో అదార్ పూణావాలా ( Adar poonawalla) తెలిపారు.ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి రానుందని..దీని ద్వారా వేల కోట్ల నిధులు ఆదా అవుతాయని ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సిన్‌(Vaccine)తో మరిన్ని ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.


Also read: Cowin registration:వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు ఆటంకం, క్రాష్ అయిన కోవిన్, ఇతర యాప్ సర్వర్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook