Cowin registration: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆదిలోనే అపశృతి ఎదురైంది. రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతూనే కోవిన్ పోర్టల్ సహా ఇతర రిజిస్ట్రేషన్ యాప్‌లు క్రాష్ అయ్యాయి. సమస్యను పరిష్కరించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
కోవిడ్ వ్యాక్సినేషన్(Covid vaccination)లో కీలకమైన అందరూ ఎదురుచూస్తున్న మూడవ దశ వ్యాక్సినేషన్ మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సినేషన్ (Vaccination for above 18 years) ఇవ్వనున్నారు. అయితే ఈ కేటగరీలో వ్యాక్సినేషన్ కోసం కోవిన్ పోర్టల్ (Cowin portal) లేదా ఆరోగ్య సేతు యాప్ ( Arogya setu app) లేదా ఉమంగ్ యాప్‌లలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఇవాళ అంటే ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది.రిజిస్ట్రేషన్ కోసం రెండ్రోజుల్నించి పెద్దఎత్తున యువత ఎదురుచూసింది. తీరా రిజిస్ట్రేషన్‌లు ప్రారంభమవుతూనే యువతకు నిరాశ ఎదురైంది. ఒక్కసారిగా కోవిన్ పోర్టల్, ఉమంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్‌లు క్రాష్ అయ్యాయి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ (Registration process) ప్రారంభమవుతూనే వేలాదిగా లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించడంతో సర్వర్‌లు క్రాష్ అయ్యాయి. సర్వర్లు క్రాష్ (Servers crashed) అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌లో తెలిపారు. కనీసం లాగిన్ అయ్యేందుకు అవసరమైన వన్ టైమ్ పాస్‌వర్డ్ కూడా రావడం లేదనే ఫిర్యాదులు భారీగా వచ్చాయి. అధికమైన సర్వర్ లోడ్ కారణంగా ఈ పరిస్థితు ఎదురైందని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Also read: Election Commission: ఎన్నికల కౌంటింగ్‌కు ఈసీ కఠిన ఆంక్షలు, నిబంధనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook