Covishield: సీరమ్ ఆధ్వర్యంలో త్వరలో కరోనా నాసల్ స్ప్రే, యూకేలో సీరమ్ భారీ పెట్టుబడులు
Covishield: దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో త్వరలో వ్యాక్సిన్ నాసల్ స్ప్రే రానుంది. మరోవైపు యూకేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది.
Covishield: దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో త్వరలో వ్యాక్సిన్ నాసల్ స్ప్రే రానుంది. మరోవైపు యూకేలో సీరమ్ ఇనిస్టిట్యూట్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది.
ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా(Oxford-AstraZeneca) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో కోవిషీల్డ్ (Covishield)పేరుతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఇదే వ్యాక్సిన్ ప్రపంచంలోని చాలా దేశాలకు ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు ఆస్ట్రాజెనెకా-సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యాన మరో అరుదైన ప్రొడక్ట్ త్వరలో మార్కెట్లో రానుంది. అదే వ్యాక్సిన్ స్ప్రే(Corona Nasal Spray). అతి తక్కువ ఖర్చుతో కూడిన ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ షాట్ ఉత్పత్తి చేయడంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ముందంజలో ఉంది. కరోనా మహమ్మారి నియంత్రణకు నాజిల్ వ్యాక్సిన్ తయారీలో సీరమ్ ఇనిస్టిట్యూట్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ వ్యాక్సిన్ నేరుగా ముక్కులో ఒక డోసు స్ప్రే చేస్తారు. ప్రస్తుతం యూకేలో మొదటి ఫేజ్ క్లినికల్ ట్రయల్స్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించింది.
ఇక ఇండియాలో తనను బెదిరిస్తున్నారంటూ కుటుంబంతో సహా యూకేకు వెళ్లిన సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) సీఈవో అదార్ పూణావాలా ( Adar Poonawalla) యూకేలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. యూకేలో కొత్త వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 2 వేల 2 వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారు.సీరమ్ ఇనిస్టిట్యూట్ పెడుతున్న పెట్టుబడి...యూకే-ఇండియాల మద్య వాణిజ్య పెట్టుబడి ఒప్పందాల విస్తృత ప్యాకేజిలో భాగమని డౌనింగ్ స్ట్రీట్ చెబుతోంది. దీని ద్వారా 6 వేల 5 వందల మందికి ఉపాధి లభించనుంది.