North India Rain Fury: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీంతోపాటు కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. చాలా ఇళ్లు నీటి మునిగాయి. ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 40 ఏళ్లలో ఎన్నడు లేనంత స్థాయిలో వానలు పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో కురవాల్సిన మొత్తం వర్షంలో ఇది 15 శాతానికి సమానం. ఈ స్థాయిలో వర్షాలు  1982 జులైలో పడ్డాయి. మళ్లీ అదే విధంగా ఇప్పుడు కురుస్తున్నాయి. దేశ రాజధానిలో ఓ ఇంటిపైకప్పు కూలి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హెవీ రెయిన్స్ కారణంగా అత్యవసర సేవల విభాగాల్లో విక్లీ సెలవులను రద్దు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌ నగర్‌లో వర్షాలకు ఓ ఇల్లు కూలి ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ భారీ వర్షాలకు రాజస్థాన్‌లోAlso నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Uniform Civil Code: ఆర్టికల్ 370 అంత సులభమేం కాదు సివిల్ కోడ్, గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు


వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్‌లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. జమ్మూలోని రెండు జిల్లాల్లో వరదల ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్ యాత్రను నిలిపేశారు. శ్రీనగర్-జమ్మూ హైవేపై మూడు వేల వాహనాలు నిలిచిపోయాయి. హర్యానా మరియు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. 


Also Read: Honey Trap Case: హనీ ట్రాప్‌లో డీఆర్డీవో సైంటిస్టు, దేశ రహస్యాలు పాకిస్తాన్‌కు చేరవేత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook