చెన్నై/తిరువనంతపురం: 'ఓఖీ' తుఫాను భీభత్సానికి తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. తుఫాను పరిస్థితి గురించి ప్రధాని మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు సమాచారం. రానున్న 48 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ఆ సమయంలో ఈదురుగాలులు వేగంతో వీస్తాయని .. కాబట్టి మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ విభాగం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా  'ఓఖీ' తుఫాను దెబ్బకు తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకూడి, నాగపట్టినం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. సముద్రంలో వేటకు వెళ్లిన 30 మంది  మత్స్యకారుల జాడ కూడా కనిపించడం లేదు. ఇప్పటివరకు 'ఓఖీ' తుఫాను కారణంగా 12 మంది వరకు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా.


కేరళలో తిరువనంతపురం, పాథానంతిట్ట, ఇడుక్కి, కొట్టాయం, అలప్పూజా జిల్లాలు కూడా 'ఓఖీ' దెబ్బకు విలవిల్లాడాయి. వర్షం తగ్గుముఖం పట్టేవరకు శబరిమలకు భక్తులెవరూ రావద్దని ఆలయం బోర్డు, పాథానంతిట్ట జిల్లా అధికారులు ప్రకటించారు.