Maharashtra govt formation I తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన శరద్ పవార్
మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. ఇదంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి తెలియకుండానే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చారు.
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) స్పందించారు. బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వడం అనేది అజిత్ పవర్(Ajit Pawar) వ్యక్తిగత నిర్ణయమని.. ఇది ఎన్సీపీ తీసుకున్న నిర్ణయం కాదని శరద్ పవార్ స్పష్టంచేశారు. శనివారం ఉదయం మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు(Maharashtra govt formation) తర్వాత ట్విట్టర్ ద్వారా స్పందించిన శరద్ పవార్.. అజిత్ పవర్ నిర్ణయానికి తాము మద్దతివ్వడం కానీ లేదా ఆమోదించడం కానీ చేయడం లేదని తేల్చిచెప్పారు. అక్టోబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు(Maharashtra assembly election results 2019) వెలువడిన నాటి నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీకీ సరైన మద్దతు లేకపోవడంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అంశం ఊగిసలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన సైతం విధించారు.
[[{"fid":"180403","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sharad Pawar`s comments on Ajit Pawar`s decision to support BJP in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"అజిత్ పవార్ నిర్ణయంపై స్పందించిన శరద్ పవార్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Sharad Pawar`s comments on Ajit Pawar`s decision to support BJP in Maharashtra","field_file_image_title_text[und][0][value]":"అజిత్ పవార్ నిర్ణయంపై స్పందించిన శరద్ పవార్"}},"link_text":false,"attributes":{"alt":"Sharad Pawar`s comments on Ajit Pawar`s decision to support BJP in Maharashtra","title":"అజిత్ పవార్ నిర్ణయంపై స్పందించిన శరద్ పవార్","class":"media-element file-default","data-delta":"1"}}]]
అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించిన అనంతరం ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే అందరూ ఊహించారు. కానీ ఉన్నట్టుండి శుక్రవారం రాత్రి తర్వాతి నుంచి శనివారం ఉదయం లోగా ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపికి మద్దతు ఇవ్వడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌లు ప్రమాణస్వీకారం చేయడం సంచలనం సృష్టించింది.
Read also : బీజేపీతో చేతులు కలపడంపై స్పందించిన అజిత్ పవార్
ఊహించని పరిణామానికి ఖంగుతిన్న శివసేన(Shiv Sena), కాంగ్రెస్(Congress) పార్టీలు ఇంకా షాక్‌లోంచి తేరుకోలేకపోతున్నాయి. ఇదంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కి తెలియకుండానే జరిగిందా అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఆయన తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చారు.