Sai Pallavi: హీరోయిన్‌ సాయిపల్లవికి భారీ షాక్‌.. 'ఫోన్‌ నంబర్ వాడినందుకు రూ.1.1 కోటి చెల్లించాల్సిందే'

Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్‌ నంబర్‌ వినియోగించడంపై అమరన్‌ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్‌ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 4, 2024, 07:59 PM IST
Sai Pallavi: హీరోయిన్‌ సాయిపల్లవికి భారీ షాక్‌.. 'ఫోన్‌ నంబర్ వాడినందుకు రూ.1.1 కోటి చెల్లించాల్సిందే'

Sai Pallavi Phone Number: సంచలన విజయం పొందిన అమరన్‌ సినిమా బృందానికి భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా సినిమా బృందం స్పందించకపోవడంతో ఓ యువకుడు మళ్లీ కోర్టు మెట్లెక్కాడు. తన ఫోన్‌ నంబర్‌ వినియోగించి ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. తనకు నష్ట పరిహారం ఇవ్వకుండా వేధించారని ఓ యువకుడు సినిమా విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. రూ.కోటి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని ఆ విద్యార్థి వాపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Pithapuram: డిప్యూటీ సీఎం ఇలాకా పిఠాపురంలో కలకలం.. పుష్ప 2 పోస్టులు చించివేత

మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'అమరన్‌. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగకు అక్టోబర్‌ 31వ తేదీన విడుదలై మంచి విజయం సాధించింది. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోకు హీరోయిన్‌ ఫోన్‌ నంబర్‌ ఇస్తుంది. అయితే ఆ ఫోన్‌ నంబర్‌ చెన్నైకి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి విఘ్నేశన్‌ నంబర్‌ కావడం గమనార్హం.

Aslo Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ

సినిమా విడుదలైన తర్వాత ఆ ఫోన్‌ నంబర్‌కు విపరీతంగా ఫోన్‌ కాల్స్‌, సందేశాలు వచ్చాయి. వాటి కారణంగా విఘ్నేశన్‌ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. సాయిపల్లవి ఫోన్‌ నంబర్‌గా భావించిన ప్రేక్షకులు కొందరు ఫోన్లు, మెసేజ్‌లు భారీగా పంపడంతో ఫోన్‌ స్తంభించింది. ఈ వ్యవహారంపై విఘ్నేశన్‌ సినిమా బృందానికి లీగల్‌ నోటీసులు పంపాడు. రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదలైన తర్వాత తన వాదనను పట్టించుకోకపోవడంతో విద్యార్థి మద్రాస్‌ హైకోర్టును సంప్రదించాడు. 'డిసెంబర్‌ 5వ తేదీన అమరన్‌ సినిమాను ఓటీటీలో అడ్డుకోవాలి' అంటూ పిటిషన్‌ వేశాడు.

వరుస ఫోన్‌ కాల్స్‌.. మెసేజ్‌లతో వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందని విఘ్నేశన్‌ వాపోయాడు. కుటుంబసభ్యులతో కూడా సక్రమంగా మాట్లాడలేకపోయానని చెప్పాడు. తన ఫోన్‌ నంబర్‌ వినియోగించిన కారణంగా తనకు రూ.1.1 కోటి పరిహారం ఇవ్వాలని లీగల్‌ నోటీసులు పంపాడు. తాజాగా ఆ లీగల్‌ నోటీసులతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరి ఈ సినిమా ఓటీటీలో విడుదల ఆగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News