Covid-19: న్యూఢిల్లీ: ప్రముఖులు, రాజకీయ నేతల తీరుతోనే ప్రభుత్వ సంస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ( Shashi Tharoor ) పేర్కొన్నారు. అయితే ఆయన ఈసారి హోం మంత్రి అమిత్ షా ( Amit Shah ) ను ఉద్దేశిస్తూ ట్విట్ సోమవారం ట్విట్ చేశారు. అయితే.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా (Coronavirus) బారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం అమిత్ షా గురుగాంలోని మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ప్రస్తుతం తనకు బాగానే ఉందని కానీ డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరుతున్నట్లు షా ట్వీట్ చేసి తెలిపారు. Also read: Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్



అయితే.. దీనిపై శశిథరూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. అనారోగ్యంతో ఉన్న మన హోం మంత్రి ఎయిమ్స్‌లో చేరకుండా.. పోరుగు రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రిని ఎందుకు ఎంచుకున్నారో ఆలోచించండి.. ప్రభుత్వ సంస్థలకు శక్తివంతుల ప్రోత్సాహం అవసరం. అప్పుడే వాటిపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది అని ఆయన ట్వీట్ చేసి ప్రశ్నించారు.  Also read: NEP-2020: త్రిభాషా సూత్రాన్ని అమలు చేయం: సీఎం పళనిస్వామి