Shiv Sena about Assembly Elections 2022 Result: ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ పరంపర కొనసాగించడంపై శివసేన స్పందించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయంపై సన్నాయి నొక్కులు నొక్కారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. యూపీ  అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలు పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. యోగి సర్కారుకు చేసిన సేవలకుగాను వీరిద్ధరికి పద్మ విభూషణ్, భారతరత్న పురస్కారాలను ప్రదానం చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ మొత్తం 13 శాతం ఓట్లు సాధించిందని గుర్తు చేశారు. 13 శాతం ఓట్లు పోలైనా బీఎస్పీ కేవలం ఒక్కటంటే ఒక్క  సీటును మాత్రమే గెల్చుకోగలిగిందని చెప్పారు. ఇక హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం కూడా 100 సీట్లలో పోటీచేసి ఒక్క సీటు కూడా గల్చుకోలేకపోయిందని అన్నారు. ఆ పార్టీకి 4 లక్షలకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని అన్నారు. ఎంఐఎం కారణంగా నాలుగు లక్షల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వృధా అయ్యాయని తప్పుపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూపీలో బీజేపీ గెల్చినప్పటికీ.. మెజార్టీ తగ్గిన విషాయాన్ని సంజయ్ రౌత్ గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ తన మెజార్టీని మూడు రెట్లు పెంచుకుందని సంజయ్ రౌత్ అన్నారు. .ఈ ఎన్నికల్లో ఎస్పీకి 125 స్థానాలు వచ్చాయని చెప్పారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చిన సీట్ల సంఖ్యతో పోల్చితే ఏకంగా మూడు రెట్లు పెరిగాయని చెప్పారు. కిందటి ఎన్నికల్లో 42 స్థానాల నుంచి ఇప్పుడు 125 స్థానాలకు సమాజ్ వాదీ పార్టీ చేరిందన్నారు. దీన్ని బట్టి  బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరిగిందో, వ్యతిరేకత ఉందొ అర్ధం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం గురించి తాము తల్లకిందులు కావాల్సిందేమీ లేదన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు.


ఇక పంజాబ్‌‌లో బీజేపీని పూర్తిగా తిరస్కరించారని గుర్తుచేశారు. జాతీయవాద పార్టీని అని చెప్పుకునే బీజేపీ పంజాబ్‌లో తిరస్కరణకు గురికావడం శోచనీయం అన్నారు. ఎన్నికలకు ముందు మోడీ, అమిత్ షా, పంజాబ్‌లో విపరీతంగా ప్రచారం చేసినా పంజాబ్‌‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎంత ఘోరంగా ఓడిపోయిందో పంజాబ్‌లో బీజేపీ (Punjab Elections Result 2022) అంత ఘోర పరాభవాన్ని ముటగట్టుకుందని అన్నారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే బీజేపీకి కలిసొచ్చిందంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.


Also read : KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!


Also read : Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook