KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!

KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Last Updated : Mar 12, 2022, 09:15 PM IST
KTR Assembly Speech: అలా ఐతే.. నీళ్లు, విద్యుత్ బంద్! మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ ఝలక్!

KTR Assembly Speech: హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ పరిధిలోని అంశాలపై కంటోన్మెంట్ బోర్డు తీసుకుంటున్న కఠిన నిర్ణయాల గురించి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కంటోన్మెంట్ అధికారులు రోడ్లు మూసేస్తే.. తాము కూడా ఆ ఏరియాకు నీళ్లు, విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వస్తుందని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

కంటోన్మెంట్‌లో చెక్ డ్యామ్ నిర్మించి నీళ్లు ఆప‌డం వల్ల అక్కడే ఉన్న న‌దీం కాల‌నీ మునిగిపోతోందని ఆవేదన వ్యక్తంచేసిన మంత్రి కేటీఆర్... హైదరాబాద్‌లోనే ఉన్న కంటోన్మెంట్ స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని మండిపడ్డారు. నీటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఒక వైపు కంటోన్మెంట్, మ‌రో వైపు ఏఎస్ఐ అడ్డుపడుతోందని సభా సాక్షిగా వివరించిన కేటీఆర్.. తెలంగాణ వేరే దేశం అన్న‌ట్టు కేంద్రం విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తోందని అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం కంటోన్మెంట్ అధికారులు తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని హితవు పలికిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Minister KTR)... అదే క్రమంలో తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఎంత‌కైనా తెగిస్తాం, ఎక్కడికైనా వెళ్తాం అని హెచ్చరించారు.

Also read: Jr Ntr Fans: కెనడాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా​.. కార్లతో RRR స్పెషల్ వీడియో..

Also read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News