భోపాల్: మధ్యప్రదేశ్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తరవాత మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ANI పేర్కొంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ పార్టీ సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోబడతారని పేర్కొంది. కాగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్  చరిత్రకెక్కనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Coronacrisis: చైనాపై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు...


సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో ఎదుర్కోవాల్సిన బల పరీక్షకు రెండు గంటల ముందే కమల్ నాథ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాగా, ఆ తరువాత బీజేపీ శాసనసభ పార్టీ సమావేశమై తాజా పరిణామాలపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. రాష్ట్ర కాంగ్రెస్ లో లుకలుకలు మొదలు కాగానే ఈ సంక్షోభాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి వ్యూహాలు రచిస్తూ బీజేపీ శిబిరానికి నాయకత్వం వహించి ప్రభుత్వంపై దాడి చేస్తూనే ఉన్నారు. బలపరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు కోరుతూ తనతో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 


Also Read: తెలంగాణలో 33 'కరోనా' పాజిటివ్ కేసులు


మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెందిన నాయకుడు గోపాల్ భార్గవ ముఖ్యమంత్రి పదవికి ఆశించిన వారిలో ఒకరు. అంతేకాకుండా కేంద్ర వ్యవసాయశాఖ  మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, తవేర్‌చంద్ గెహ్లోట్, శాసనసభ పార్టీ చీఫ్ విప్ నరోత్తం మిశ్రా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు కైలాష్ విజయవర్గియా పేర్లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ చివరకు అధినాయకత్వం శివరాజ్ సింగ్ చౌహన్ వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..