Coronacrisis: చైనాపై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు...

ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇటలీ తర్వాత కరోనా పాజిటివ్ బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే అని WHO అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సుమారుగా 33,546 మంది కరోనా పాజిటివ్ బాధితులున్నారని, మృతుల సంఖ్య 419 చేరిందని, 

Last Updated : Mar 23, 2020, 05:33 PM IST
Coronacrisis: చైనాపై డొనాల్డ్ ట్రంప్ నిప్పులు...

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చైనా, ITALYతర్వాత కరోనా పాజిటివ్ బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే అని WHO అధికారిక వర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సుమారుగా 33,546 మంది కరోనా పాజిటివ్ బాధితులున్నారని, మృతుల సంఖ్య 419 చేరిందని, అయితే, ఒక్క రోజు వ్యవధిలో 100 మరణాలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. 

Also Read: తెలంగాణలో 33 'కరోనా' పాజిటివ్ కేసులు

సరైన సమయంలో చైనా ప్రపంచంతో సమాచారం పంచుకోని కారణంగానే ఈ మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తోందని ఆరోపించారు. ప్రాథమిక దశలోనే చైనా ఈ కరోనా మహమ్మారి వైరస్ గురించి తమకు సమాచారం అందించి ఉంటే బాగుండేదని, తద్వారా నివారణకు అవకాశం ఉండేదని, చైనా వైఖరి తమకు అసంతృప్తిని కలిగించిందని అన్నారు. కానీ తాము చైనాలా ఎప్పటికీ వ్యవహరించనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయని, అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారని తెలిపారు. 

Read Also: లాక్ డౌన్ ఎఫెక్ట్: దళారుల రాజ్యం

బెల్జియంలోని బ్రస్సెల్స్ లో థింక్ ట్యాంక్ యూరప్, జియోపాలిటిక్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ యూరప్ డైరెక్టర్ షాదా ఇస్లాం మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సమయాల్లో, నాయకులు, ప్రజలు కలిసి పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావాలని, ఇప్పటికే సమయం ఆసన్నమైందని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఒకరిపై ఒకరు ఆరోపణలు, అవమానకర వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదన్నారు.  

మరోవైపుDONALD TRUMP ఉద్దేశపూర్వకంగా జాత్యహంకార ప్రసంగాన్ని ఉపయోగిస్తున్నారని, తీవ్రతను అరికట్టంపై కాకుండా పౌరుల్లో ఆందోళన కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అమెరికా ప్రజల దృష్టిని మరల్చడమే మిగతా దేశాల విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లాభాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుండటంతో, మరోవైపు  అధ్యక్ష ఎన్నికలుండటంతో ఇతరులపై నిందా వేయడం సరికాదన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News