తెలంగాణలో 33 'కరోనా' పాజిటివ్ కేసులు

తెలంగాణలో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి  వరకు మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది.

Last Updated : Mar 23, 2020, 03:56 PM IST
తెలంగాణలో 33  'కరోనా' పాజిటివ్ కేసులు

తెలంగాణలో 'కరోనా వైరస్' క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజు రోజూ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి  వరకు మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరుకుంది. 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల  రాజేందర్  ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవాళ ఒక్కరోజే  కొత్తగా  6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.  అందులోనూ కాంటాక్ట్ కేసులు మూడు  ఉన్నాయని తెలిపారు.  33 పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ పరిస్థితి అంతా అదుపులోనే ఉందని చెప్పారు. ఎవరూ  కరోనా వైరస్ గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. సామూహిక ప్రదేశాల్లోకి రావద్దని తెలిపారు. 

లాక్ డౌన్ ఎఫెక్ట్: దళారుల రాజ్యం

లాక్ డౌన్ చేశాం కాబట్టి .. పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల  రాజేందర్ అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News