Ramdev on Petrol: నోరు మూసుకో.. మళ్లీ అడిగితే బాగుండదు! లైవ్‌లోనే జర్నలిస్టుపై రామ్‌దేవ్ ఫైర్!!
Ramdev Baba fires on Journalist about petrol at Rs 40 comment. యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై నోరు మూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు అని ఫైర్ అయ్యారు.
Ramdev Baba fires on reporter about petrol at Rs 40 comment: యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై నోరు మూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు అని ఫైర్ అయ్యారు. హరియాణాలోని కర్నాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌దేవ్ ఇలా ఆగ్రహంతో ఊగిపోయారు. దేశవ్యాప్తంగా మండిపోతున్న చమురు ధరలపై ప్రశ్న ఎదురు కావడంతో రామ్‌దేవ్ భగ్గుమన్నారు. కెమెరా సాక్షిగా రిపోర్టర్‌ను చెడామడా తిట్టేశారు.
దేశ వ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. గత పది రోజులుగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖులు అందరూ దహరాల పెంపుపై మండిపడుతున్నారు. అయితే పెట్రోల్ రూ.40, గ్యాస్ సిలిండర్ రూ.300కు ఇచ్చే ప్రభుత్వాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలంటూ రామ్‌దేవ్ బాబా గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇవే వ్యాఖ్యలను సదరు పాత్రికేయుడు ప్రస్తావించారు. మరి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇబ్బంది పడ్డ రామ్‌దేవ్ బాబా.. 'అవును ఆ మాట అన్నది నిజమే.. ఇప్పుడేం చేస్తావ్? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉండకు. నీకు సమాధానం చెప్పడానికి నేనేమీ నీ కాంట్రాక్టర్' కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కూడా సదరు మీడియా ప్రతినిధి అదే ప్రశ్న సంధించారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రామ్‌దేవ్ బాబ.. తాను ఆ మాట అన్నాననీ.. అయితే ఏంటి ? నోర్మూసుకో.. మళ్లీ ఇదే ప్రశ్న అడిగితే బాగుండదని హెచ్చరించారు. అయితే ధరలు పెరుగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు కష్టపడి పని చేయాలని రామ్‌దేవ్ బాబా సూచించారు. చమురు ధరలు తగ్గితే.. పన్ను రాదని ప్రభుత్వం చెబుతోందన్నారు. వచ్చే ఆదాయం తగ్గితే జీతాలు ఎలా ఇవ్వాలి? రోడ్లు ఎలా వేయాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోందన్నారు. అందుకే ప్రజలు ఎక్కువగా శ్రమించాలన్నారు. తాను ఉదయం నాలుగు గంటలకు లేచి రాత్రి పది గంటల వరకు పని చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read: KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!
Also Read: Samantha Ruth Prabhu: సిద్ధంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook