KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!

KGF 2 Dialogues: సినీ ప్రేక్షకులు ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్ 2'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీక్వెల్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఇప్పుడా మూవీకి సీక్వెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మాత్రం ఓ స్టార్ హీరో రాశారంట. అదెవరో తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 02:20 PM IST
KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!

KGF 2 Dialogues: కన్నడ స్టార్ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కేజీఎఫ్'. కొన్నేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ మూవీలోని రాకీ భాయ్ పాత్రకు ఎంతో మంది అభిమానులుగా మారారు. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సీక్వెల్ 'కేజీఎఫ్ 2' విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. 

ప్రమోషన్స్ లో భాగంగా 'కేజీఎఫ్ 2' సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. హీరో యష్ చెప్పిన డైలాగ్.. "వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్, వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్" అందర్ని ఆకట్టుకుంటోంది. 

అయితే ఇటీవలే జరిగిన 'కేజీఎఫ్ 2' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సీక్రెట్ చెప్పారు. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న 'కేజీఎఫ్' మూవీ డైలాగ్స్ ను ఓ స్టార్ హీరో రాశారంట. ఆయన ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో యష్. సినిమాలో ఆయన పోషించిన పాత్ర రాకీ భాయ్ కు ఆయనే సగం డైలాగ్స్ రాసుకున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు.  

Also Read: Macherla Niyojakavargam Teaser: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' టీజర్ వచ్చేసింది!

Also Read: RRR Movie Collections: ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News