Samantha Ruth Prabhu: సిద్ధంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత!!

Samantha Ruth Prabhu on Kaathuvakula Rendu Kaadhal Movie. కాతువాకుల రెండు కాదల్‌ సినిమాకు సంబంధించి సమంత కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు సామ్ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 01:00 PM IST
  • దూకుడు పెంచిన సమంత
  • ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత
  • కడుపు చెక్కలయ్యేలా నవ్వడం కోసం ఎదురుచూస్తున్నా
Samantha Ruth Prabhu: సిద్ధంగా ఉండండి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సమంత!!

Samantha Ruth Prabhu on Kaathuvakula Rendu Kaadhal Movie: విడాకుల అనంతరం టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత దూకుడు పెంచిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. తమిళంలో సామ్ చేస్తున్న తాజా సినిమా 'కాతువాకుల రెండు కాదల్‌'. ఈ సినిమాలో సమంతతో పాటు నయనతార, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రై యాంగిల్ లవ్ స్టోరీతో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కింది. 

కాతువాకుల రెండు కాదల్‌ సినిమాకు సంబంధించి సమంత కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తియినట్లు సామ్ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అంతేకాదు మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. 'మీరంతా కడుపు చెక్కలయ్యేలా నవ్వడం కోసం నేను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏప్రిల్‌ 28న సినిమా విడుదల కానుంది' అని ఇన్‌స్టాలో సామ్ పోస్ట్‌ చేశారు. 

సమంత తన పోస్ట్‌కు సినిమాలోని కొన్ని సన్నివేశాలతో పాటు షూటింగ్‌ ముగింపు వేడుక ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఫోటోలలో విజయ్‌ సేతుపతిని పట్టుకుని నయన తార, సమంత వేలాడి ఉన్నారు. నయన్ సారీలో ఉండగా.. సామ్ పొట్టి డ్రెస్సులో ఔరా అనిపిస్తున్నారు. మరికొన్ని ఫోటోలలో ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని 'కన్మణి రాంబో ఖతీజా' పేరుతో విడుదల చేస్తున్నారు. రౌడీ పిక్చర్స్, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఉదయనిధి స్టాలిన్‌ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానర్‌పై డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. 

సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. దర్శక ద్వయం హరి అండ్ హరీష్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ థ్రిల్లర్ 'యశోద' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్, ఉన్ని ముకుందన్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం', హాలీవుడ్ చిత్రం 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' వంటి చిత్రాలలో సామ్ నటిస్తున్నారు.

Also Read: Eesha Rebba Photos: మాడ్రన్​, ట్రెడిషనల్​ లుక్స్​తో కుర్రకారు మతిపోగొట్టేస్తున్న తెలుగు బ్యూటీ..

Also Read: Kriti Sanon Pics: బ్లాక్​ డ్రేస్సులో మతిపోగొట్టే ఫోజుల్లో మహేశ్​ బ్యూటీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 
 

Trending News