మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ ముఖ్యమంత్రి!
తనను ఎదురు ప్రశ్నిస్తున్న మహిళను గద్దించిన సిద్ధరామయ్య.. ఆమె ధరించిన చున్నీని లాగిపడేసే ప్రయత్నం చేశారు.
కర్ణాటకలోని మైసూరులో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్లో తనను ప్రశ్నించి, నిలదీసిన మహిళ పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుచితంగా ప్రవర్తించారు. తనను ఎదురు ప్రశ్నిస్తున్న మహిళను గద్దించిన సిద్ధరామయ్య.. ఆమె వద్ద వున్న మైకు లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె ధరించిన చున్నీ సైతం కాస్త ముందుకు ఊడి రావడం సిద్ధరామయ్యను వివాదంలోకి నెట్టేసింది. ఆమె వెంటనే గమ్మున కూర్చుని నోరు మూసుకోవాల్సిందిగా సూచిస్తూ సిద్దరామయ్య గట్టిగా అరిచారు. ఆమె ఎంతకీ తన మాట వినకపోవడంతో ఇక తానే లేచి నిల్చుని మరీ మరింత గట్టిగా అరిచారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆ మహిళ తన కుర్చిలో తాను కూర్చుండిపోవాల్సి వచ్చింది.