Sidhi Peeing Incident: మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై అగ్ర కులానికి చెందిన వ్యక్తి పర్వేశ్‌ శుక్లా మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెల్సిందే. అత్యంత దారుణంగా గిరిజన యువకుడిని కొట్టిన ఆ వ్యక్తి ఏకంగా అతడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో లు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో దేశ వ్యాప్తంగా గిరిజన హక్కుల పరిరక్షణ సమాఖ్య సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో వెంటనే ఆ పని చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేయడం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సదరు బాధితుడిని తన నివాసానికి పిలిపించి కాళ్లు కడిగి మరీ తన పరిపాలనలో ఇలాంటి పని జరిగినందుకు గాను క్షమాపణలు అడిగిన వీడియో ఆ తర్వాత వైరల్‌ అయ్యింది. మొత్తానికి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ గొప్పోడు అంటూ దేశం మొత్తం మాట్లాడుకునేలా సంఘటన మారింది. 


ఇప్పుడు ఈ సంఘటన మరో అతి పెద్ద టర్న్ తీసుకుంది. ఇటీవల బాధితుడిగా పిలవబడుతున్న వ్యక్తి దశమత్‌ మీడియా ముందుకు వచ్చి తనపై పర్వేశ్‌ శుక్లా మూత్ర విసర్జన చేయలేదు అన్నాడు. అంతే కాకుండా ఆ బాధితుడిని నేను కాదని పేర్కొన్నాడు. దశమత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గిరిజనుడిపై మూత్ర విసర్జన చేయడం అతి పెద్ద తప్పు అయితే.. దాన్ని కప్పి పుచ్చేందుకు రాజకీయంగా వినియోగించుకునేందుకు ఎవరినో తీసుకు వచ్చి కాళ్లు కడిగినట్లుగా డ్రామా లు చేసి.. రాజకీయం చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 


Also Read: Ghaziabad Road Accident: కారుపై దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి.. సీసీ ఫుటేజ్‌లో రికార్డు   


దశమత్ అసలు బాధితుడు కాకుంటే అసలు బాధితుడు ఎవరు అనేది అందరి ప్రశ్న. నిందితుడు ప్రవేశ్‌ శుక్లా బలవంతం చేయడం వల్లే తానే ఆ బాధితుడిని అంటూ ఒప్పుకున్నాను అని దశమత్ మీడియా ముందు పేర్కొన్నాడు. ప్రవేశ్‌ తనతో ఒప్పందం పై సంతకాలు కూడా పెట్టించుకున్నాడు అంటూ దశమత్ పేర్కొన్నాడు. 


సీఎం చౌహాన్‌ కి ముందే ఈ విషయం తెలుసని.. అతడు బాధితుడు కాదని తెలుసని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యం మంచి పేరు కోసం అధికార పార్టీ నాయకులు ఈ పని చేసి ఉంటారు అనిపిస్తుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత రాద్దాంతం జరుగుతున్నా కూడా సీఎం చౌహాన్ మాత్రం నోరు విప్పక పోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: Heavy Rains: ఉత్తరాదిన ఊహకందని జల విలయం.. ఇబ్బందుల్లో జనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి