ఉత్తరప్రదేశ్‌లో ఇంకా యోగి ఆదిత్యనాథ్ హవా కొనసాగుతోంది. జులై 22 2017 తేదిన యూపీ నియోజకవర్గమైన సికిందరా ఎమ్మెల్యే మధురప్రసాద్ లాల్ మరణించడంతో.. ఆ ప్రాంతానికి సంబంధించి బైపోల్స్‌ను ఇటీవలే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన లాల్ కుమారుడు అజిత్ పాల్ సింగ్, తన సమీప సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సీమా సచన్ పై 7000 ఓట్ల తేడాతో గెలుపొందారు.


ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మూడవ స్థానానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటికి దిగడం గమనార్హం. కాన్పూర్ దేహత్ జిల్లా పరిధిలోకి వచ్చే సికిందరాలో గతకాలంగా బీజేపీయే సత్తా చాటుతోంది. బండిట్ క్వీన్ ఫూలన్ దేవి తనపై అత్యాచారం చేసిన వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన 21 రాజపుత్‌లను కాన్పూర్ దేహత్ కేంద్రంగానే హతమార్చడం మనకు తెలిసిన విషయమే.