Sikkim Arunachal Pradesh Election Results: ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీలే సత్తా చాటాయి. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం), అరుణాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీకి అధికారం కట్టబెడుతూ అక్కడి ఓటర్లు తీర్పునిచ్చారు. లోక్‌సభ ఫలితాలకు వెలువడిన ఫలితాలు బీజేపీలో జోష్‌ నింపాయి. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలు పునరావృతమవుతాయని కాషాయ పార్టీ ధీమాగా ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల వెల్లడి రోజే వీటి ఫలితాలు రావాల్సి ఉంది. మొదట ప్రకటనలో అదే ఉండేది. కానీ ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో ముగియనుండడంతో ఫలితాల వెల్లడి తేదీని ముందుకు జరిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం వెలువడిన ఫలితాలు ప్రత్యేకత చాటుకున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Party Rally: అమరుల యాదిలో గులాబీ దళం.. భావోద్వేగానికి గురయిన కేసీఆర్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో రెండు పర్యాయాలు బీజేపీ పాలించింది. సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బ్రహ్మాండంగా విజయం సాధించింది. సమాచారం అందిన వరకు 39 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుస్తుందని తెలుస్తోంది. అయితే వాటిలో 10 స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కాషాయ పార్టీ 45 స్థానాలు దక్కించుకుంటుందని తెలుస్తోంది. అక్కడి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది. పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ రెండు ఎమ్మెల్యేలను, ఎన్సీపీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుపొందింది. కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలవడం గమనార్హం. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీ 41 ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Hyderabad Lok Sabha: మాధవీలతకు భారీ షాకిచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌.. అసద్‌ గెలవబోతున్నారా?


 


సిక్కింలో..
మరో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో పాలక పార్టీనే విజయం సాధించింది. సిక్కిం ప్రజలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. 32 స్థానాలు ఉండగా ఏకంగా 31 ఎమ్మెల్యే స్థానాలను సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) కొల్లగొట్టి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒక స్థానానికి సిక్కిం డెమెక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్డీఎఫ్‌) పరిమితమైంది. అయితే 25 ఏళ్ల పాటు ఎస్‌డీఎఫ్‌ పార్టీని సిక్కిం ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే సిక్కింలో ఉన్న ఒక లోక్‌సభ, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రెండు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీనే విడుదల కానున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter