Sputnik v vaccine: కరోనా మహమ్మారి కట్టడి విషయంలో మరో గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. రష్యాకు చెందిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్  ఇండియాలో  అందుబాటులో రానుంది. ప్రభుత్వంతో చర్చలు పూర్తయితే..సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ చికిత్సలో డీఆర్డీవో (DRDO) భాగస్వామ్యంతో 2డీజీ మందును మార్కెట్లో ప్రవేశపెట్టిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys Labs) నుంచి మరో గుడ్‌న్యూస్ అందుతోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుట్నిక్ వి వ్యాక్సిన్‌ను ఇప్పటికే రెడ్డీస్ ల్యాబ్ ఇండియాలో మార్కెట్ చేస్తోంది. ఇప్పుడీ వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. గమలేయా ఇనిస్టిట్యూట్ (Gamaleya Institute) అభివృద్ధి చేసిన స్పుట్నిక్ వి లైట్ అనే సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇప్పటికే రష్యా ప్రభుత్వ ఆమోదం పొందింది. స్పుట్నిక్ వి లైట్ వ్యాక్సిన్‌ ( Sputnik v light) ను ఇండియాలో వేగంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అన్నీ సజావుగా జరిగితే దేశంలో ప్రవేశపెట్టనున్న తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది. స్పుట్నిక్ వి వ్యాక్సిన్ వెబ్‌సైట్ ప్రకారం ఈ వ్యాక్సిన్ 79.4 శాతం సామర్ధ్యాన్ని ప్రదర్సిస్తోంది. 


ఇప్పటికే ఇదే కంపెనీకు సంబంధించిన రెండు డోసుల వ్యాక్సిన్ స్పుట్నిక్ వి (Sputnik v) ఇండియాలో డీసీజీఐ అనుమతి పొంది..డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అవుతోంది. వచ్చే నెల నుంచి ఈ వ్యాక్సిన్ దేశీయంగానే ఉత్పత్తి కానుంది. సింగిల్ డోసు వ్యాక్సిన్ ఇండియాలో అందుబాటులో వస్తే..వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరమవుతుంది.


Also read: Tamilnadu: మళ్లీ రాజకీయాల్లో శశికళ..ఏఐఏడీఎంకే వర్గాల్లో కలవరం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook