గౌరీ లంకేష్ హత్య కేసులో ఏడో వ్యక్తి అరెస్ట్
గౌరీ లంకేష్ హత్య కేసులో ఏడవ అనుమానితుడిని అరెస్ట్ చేసిన సిట్
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీ లంకేష్ హత్య కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏడవ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. ఈ కేసుని విచారిస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న అధికారి ఎం.ఎన్. అంచేత్ బెంగుళూరులో పీటీఐతో మాట్లాడుతూ కర్ణాటకలోని దక్షిణ్ కన్నడ జిల్లా నుంచి మోహన్ నాయక్ (50) అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. జులై 18న మోహన్ నాయక్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మోహన్ నాయక్‌కి ఆరు రోజుల కస్టడీ విధించింది.
ఇదిలావుంటే, జూన్ నెలలోనే 6వ అనుమానితుడిగా పరశురామ్ వాఘ్‌మరె అనే యువకుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.