గుజరాత్ : జాతిపిత మహాత్మా గాంధీని హతమార్చిన నాధూరామ్ గాడ్సే పుట్టిన రోజు వేడుకలను జరిపిన ఆరుగురు హిందూ మహాసభ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం  సూరత్‌ లోని ఓ దేవాలయంలో ఆదివారం నాడు హిందూ మహాసభ కార్యకర్తలు గాడ్సే జయంతి వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో భాగంగా గాడ్సే ఫోటో చుట్టూ దీపాలు వెలిగించి పూజలు  నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకుని భజన కార్యక్రమాల్ని నిర్వహించారు. లింబాయత్‌ ప్రాంతంలోని సూర్యముఖి హనుమాన్‌ దేవాలయంలో పూజలు నిర్వహించినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో పోస్టులు..


గాడ్సే పుట్టిన రోజుకు వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే కేసు నమోదు చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారనే ఆరోపణలపై సోమవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జాతిపిత గాంధీని కాల్చి చంపిన వ్యక్తికి పుట్టిన రోజు వేడుకలు జరపడం విచారకరమని.. ఇలాంటి చర్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయని ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. తాజా వ్యవహారంపై బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి