ఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం జరుగుతున్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నుంచి రాహుల్ సోనియాలు అర్థంతరంగా బయటికి వెళ్లిపోయారు. తాము ఈ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగస్వాములు కాలేమని రాహుల్, సోనియాలు తేల్చి చెప్పారు. అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరగాలనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరువురు స్పష్టం చేశారు. కాగా  అధ్యక్ష పదవికి గాంధీ కుంటుంబానికి వీర విధేయులైన ముకుల్‌ వాస్నిక్‌, మల్లికార్జున్‌ ఖర్గే పేర్లు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంప్రదింపులు ప్రక్రియు షురు


కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి చేపట్టేందుకు రాహుల్ గాంధీ తిరస్కరించడంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు సీఎల్పీ సమావేశమైంది. రాహుల్ గాంధీ సూచన మేరకు సారథి ఎంపిక కోసం సంప్రదింపులు జరిపేందకు సీడబ్ల్యూసీ ఐదు కమిటీలుగా విడిపోయింది. రాష్ట్ర స్థాయి నేతలతో చర్చలు జరిపేందుకు తూర్పు రీజియర్‌, పశ్చిమ రీజియన్‌, ఉత్తర, దక్షిణ, ఈశాన్య రీజియన్‌ నేతలతో ఐదు బృందాలు ఏర్పాడ్డాయి. ఈ బృందాలు రాష్ట్ర స్థాయి సీఎల్పీ నేతలతో చర్చలు జరిపి అధ్యక్షుడిపై ఓ నిర్ణయానికి రానున్నాయి. అయితే  ఇందులో రాహుల్, సోనియాల పేర్లు చేర్చారు. విషయం తెలుసుకున్న రాహుల్ సోనియాలు ఈ మేరకు స్పందించారు.


భేటీకి హాజరైన కీలక నేతలు
కాంగ్రెస్  పార్టీ  ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లతో పాటు మన్మోహన్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్‌ సుర్జేవాలా తదితర సీనియర్‌ నేతలు హాజరయ్యారు.