Real Hero Sonu Sood: సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు. కరోనావైరస్ ( Coronavirus ) లాక్‌డౌన్‌లో వేలాదిమంది వలస కూలీలను ఇళ్లకు చేర్చి ఆపద్భాందవుడయ్యాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఓ రైతు కుటుంబం పడుతున్న కష్టాన్ని చూసి ఏకంగా ట్రాక్టర్‌నే పంపించి వారికి సాయం చేశాడు. అయితే.. తాజాగా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన తెలంగాణ ( Telangana ) వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ శారదకు సోనూసూద్‌ జాబ్‌ ఆఫర్‌ ఇచ్చి అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Also read: Sonu Sood: కలియుగ కర్ణుడు సోనూ సూద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరంగల్‌ జిల్లాకు చెందిన శారద కుటుంబం చాలాకాలం క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చారు. శారద బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివింది. కొన్నాళ్లు ఢిల్లీలో ఉద్యోగం చేసి.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరిగొచ్చి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరింది. అయితే.. కరోనా కారణంగా ఆమె చేరిన మూడు నెలల్లోనే కంపెనీ సంక్షోభంలో పడింది. దీంతో శారద ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఆమె కుంగిపోకుండా తన తండ్రి నమ్ముకున్న వ్యాపారాన్ని మొదలుపెట్టింది. వరంగల్ వెళ్లి నగరంలోని శ్రీనగర్‌కాలనీలో కూరగాయలు విక్రయించడం ప్రారంభించింది. 



ఈ విషయం పలు ఛానెళ్లు, సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో.. వెంటనే సోనూసూద్ నేనున్నా అంటూ ముందుకొచ్చాడు. శారదను ఆదుకుంటా అంటూ ట్విట్లర్‌లో తెలిపిన రెండు రోజులకే ఆమెకు ఆపన్నహస్తం అందించాడు. ఈ మేరకు సోనూసూద్ సోమవారం ట్విట్ చేశాడు. ‘‘మా ప్రతినిధి శారదను కలిశారు, ఇంటర్వ్యూ పూర్తయింది. జాబ్‌ లెటర్‌ కూడా ఆమెకు పంపించాం. జై హింద్‌' అంటూ సోనూసూద్ ట్వీట్‌ చేశారు. ఆయన సాయానికి సోషల్ మీడియా నెటిజన్లందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జాబ్‌ ఆఫర్‌ ప్రకటించడంపై శారద సంతోషాన్ని వ్యక్తంచేసింది.  Read This Story Also: #SonuSoodRealHero:అరుంధతి విలన్..రియల్ లైఫ్ హీరో