Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు అయ్యింది. దీంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాగల మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉండనుంది. ఈమేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌ పరిసరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశ వైపునకు ఉపరితల ఆవర్తనం తిరిగింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర ఒడిశా పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు కింది స్థాయి గాలులు పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి మరికొన్ని చోట్ల వానలు పడనున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటికి ఉపరితల ఆవర్తనం తోడు అవడంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న చాలా చోట్లు కుండపోత వానలు పడ్డాయి. భారీగా వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. పొలాల్లో నాట్లు వేస్తున్నారు. మరికొన్ని రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


Also read:CM Kcr on PM Modi: ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు..మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!


Also read:Chandrababu Naidu: పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేయండి..ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook