UP Polls 2022: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు.. అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు
Akhilesh Yadav Sensational Allegations:ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు గడువు దగ్గరపడిన వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.
Akhilesh Yadav Sensational Allegations: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు గడువు దగ్గరపడిన వేళ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (EVM) భద్రతపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్.. ఎన్నికల సంఘం అధికారులు వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక అభ్యర్థులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ఈవీఎంలను తరలించారని ఆరోపించారు.
దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని అఖిలేశ్ విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ట్విట్టర్‌లోనూ స్పందించిన అఖిలేశ్.. వారణాసిలో ఈవీఎంలు పట్టుబడటంతో యూపీలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా కౌంటింగ్ రోజు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉన్నందునా.. ఎస్పీ మద్దతుదారులంతా తమ కెమెరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓట్ల లెక్కింపు రోజు యువత సైనికుల్లా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్నటితో (మార్చి 7) ఏడు విడతల పోలింగ్ పూర్తయింది. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడగా.. దాదాపుగా అన్ని పోల్స్ యూపీలో మరోసారి బీజేపీదే అధికారమని అంచనా వేశాయి. గతం కన్నా ఎస్పీకి సీట్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారం మాత్రం దక్కదని తేల్చాయి.
అఖిలేశ్ యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలను తోసిపుచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఎస్పీదే అధికారమని అంటున్నారు. అంతేకాదు, ఎస్పీ కచ్చితంగా 300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని.. ఫలితాలు వెలువడే రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవమరించాలన్నారు. ఈ మేరకు ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ పార్టీ శ్రేణులకు ఒక అడ్వైజరీ జారీ చేశారు.
Also Read: Russia Ukraine War: ఎట్టకేలకు సుమీ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు..
Also Read: Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్‌గా మారిన బొమ్మలు అమ్మే యువతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook