Indians Evacuation from Ukraine: రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం సుమీలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తరలించినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. సుమీ నుంచి మొత్తం 694 మంది భారతీయ విద్యార్థులను బస్సుల్లో ప్రస్తుతం పోల్తావా నగరానికి తరలిస్తున్నట్లు తెలిపింది. అక్కడి నుంచి రైళ్ల ద్వారా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతానికి చేరుకుంటారని వెల్లడించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటన చేశారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఆ విద్యార్థులను భారత్‌కు తరలించేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాలను సిద్ధం చేసినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. సుమీలోని విదేశీ విద్యార్థులు సహా పౌరులందరినీ పోల్తావాకు తరలిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లోని ఇతర హ్యుమనిటేరియన్ కారిడార్‌లను కూడా రష్యా అనుమతించాలని కోరుతున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం సుమీ నుంచి పోల్తావా నగరానికి తరలుతున్న విద్యార్థుల్లో ఒకరు ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడారు. 'మొదట మమ్మల్ని పోల్తావాకు తరలిస్తారని చెప్పారు. మేము సేఫ్ జోన్‌కు చేరుకోవాలని.. ఈ ఆపద నుంచి బయటపడాలని నేను ప్రార్థిస్తున్నాను.' అని పేర్కొన్నారు. కాగా, సుమీ రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఇక్కడి నుంచి విద్యార్థుల తరలింపు సంక్లిష్టంగా మారింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడి విద్యార్థుల తరలింపుకు సహకరించాలని కోరారు. దీంతో సుమీలో తాత్కాలిక కాల్పుల విరమణ చేస్తున్నట్లు రష్యా ప్రకటించగా.. భారతీయ విద్యార్థుల తరలింపుకు మార్గం సుగమమైంది. ఆపరేషన్ గంగాలో భాగంగా ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి వేలాది మంది భారతీయులను భారత్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
Happy to inform that we have been able to move out all Indian students from Sumy.
They are currently en route to Poltava, from where they will board trains to western Ukraine.
Flights under #OperationGanga are being prepared to bring them home. pic.twitter.com/s60dyYt9U6
— Arindam Bagchi (@MEAIndia) March 8, 2022
We have already started the evacuation of civilians from Sumy to Poltava, including foreign students.
We call on Russia to agree on other humanitarian corridors in Ukraine.#Ukraine #StopRussianAggression pic.twitter.com/pmjhHLkIrH
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 8, 2022
Also Read: BJP MLA's Suspension: కేసీఆర్ దిష్టిబొమ్మకు నడిరోడ్డులో ఉరి... కేటీఆర్ ఇలాఖాలో బీజేపీ నిరసన
Also Read: Trending News: సోషల్ మీడియా చేసిన సెలెబ్రెటీ- మోడల్‌గా మారిన బొమ్మలు అమ్మే యువతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook