Indian Presidential Election-2022: రాష్ట్రపతి ఎన్నికకు వేళాయే..ఈసారి ప్రత్యేకతలేంటో తెలుసా..?
Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు వేళ అయ్యింది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఫలితాలు రానున్నాయి. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు ఈనెల 29 వరకు గడువు ఉంది. రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది.
Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరిగినా ఆసక్తిని రేపించాయి. వచ్చే నెల 18న 16వ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఐనా ఆ ఎన్నిక 15వ ది. ప్రస్తుతం 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవిలో కొనసాగుతున్నారు. ఒకసారి ఆ పదవిలో ఉన్న వారు ఎన్నిసార్లు అయినా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రమే రెండుసార్లు పనిచేశారు. ఐతే అత్యున్నత విలువలను అనుసరించి రెండోసారి పోటీ చేయకూడదని నిర్ణయించారు.
బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత ఎవరూ రెండోసారి పోటీలో నిలవలేదు. ఒక్కసారి మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. 1969లో నాటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ చనిపోయారు. అప్పటి ఉపరాష్ట్రపతి వీవీ గిరి తాత్కాలికంగా కొనసాగారు. ఈక్రమంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన 1969 జులై 20న తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ఆ పదవిని చేపట్టారు.
1977 ఫిబ్రవరి 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ చనిపోయారు. దీంతో ఉపరాష్ట్రపతి బీడీ జెట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటివరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. 1977లో మాత్రమే నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవమైయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేసే సంస్కృతి లేదు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పనిచేస్తారు. నామినేషన్ వేసే సమయంలో డిపాజిట్‌గా రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 4 వేల 809 మంది ఎన్నికల్లో పాల్గొంటారు. ఇద్దరి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ఓటు విలువ లెక్కింపునకు 1971 నాటి 54.93 కోట్ల జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటూ వస్తున్నారు. మళ్లీ రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు అంటే 2026 వరకు ఇదే ప్రాతిపదికగా ఎన్నికలు జరుగుతాయి. 776 మంది ఎంపీల ఓటు విలువ 5 లక్షల 43 వేల 200గా ఉంది.
మొత్తం 4 వేల 33 ఎమ్మెల్యేల ఓటు విలువ 5 లక్షల 43 వేల 231గా ఉంది. ఇప్పటివరకు 1967 ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది బరిలో నిలిచారు. నాలుగు, ఐదవ రాష్ట్రపతి ఎన్నికల్లో 15 మంది చొప్పున ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఈఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉండదు. ఎమ్మెల్సీలు, నామినెటెడ్ సభ్యులకు ఓటు హక్కు అవకాశం లేదు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కార్యాలయానికి తరలిస్తారు. అక్కడే ఓట్ల లెక్కింపు ఉంటుంది.
గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉండాలంటే ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ ప్రతిపాదించి..మరో ఎమ్మెల్యే లేదా ఎంపీ బలపర్చాల్సి ఉండేది. ఐతే 1974లో రాజ్యాంగ సవరణ చేసి ఆ సంఖ్యను పదికి పెంచారు. మళ్లీ 1997లో సవరణ చేసి బలపరిచే వారి సంఖ్యను 50కి మార్చారు. ప్రయాణికుడితో సమానంగా వస్తువుకు విమాన టికెట్ కొనడం రాష్ట్రపతి ఎన్నికల్లోనే జరుగుతుంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానులు, ఓటింగ్ ప్రక్రియ పూర్తైన తర్వాత మళ్లీ ఢిల్లీకి బ్యాలెట్ బాక్స్‌లను తరలించేందుకు విమాన టికెట్లను తీస్తారు.
ఎమ్మెల్యేల అత్యధిక ఓటు విలువ 208 యూపీలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటు విలువ ఉన్న రాష్ట్రంగా సిక్కిం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా పెన్నులను ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కానీ పక్షంలో ఆ ఓటు చెల్లదు. ఈ ఎన్నికల్లో నోటా ఉంది. ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
Also read:Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు తప్పని చేదు అనుభవం..అసలేమి జరిగిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook