KTR Letter to PM Modi: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ విమర్శల దాడిని పెంచింది. ఇటీవల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై కేంద్రం తీరును ఎండగట్టింది. తాజాగా ఉద్యోగాల భర్తీపై పోరు బాట పట్టింది. ఈక్రమంలోనే ప్రధాని మోదీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు..ఈ హామీ ఏమయ్యిందని లేఖలో ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటికే లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేశామన్నారు. మరో లక్ష ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించామని స్పష్టం చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేయకపోగా..ఉన్న ఉపాధికి గండి కొడుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా శాశ్వతంగా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేసి..భారీగా దెబ్బ తీశారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. దీనిపై యువతతో కలిసి ప్రజా పోరాటం చేస్తామని లేఖలో స్పష్టం చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ పేరుతో గప్పాలు కొడుతున్నారన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ నేతల తీరు తీస్తుంటే సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇంతవరకు నయా పైసా కేటాయించలేదని..దీనిపై వైఖరి ఏంటో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ నుంచే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మంత్రి.
Also read:Ante Sundaraniki OTT: 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా?
Also read:Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు తప్పని చేదు అనుభవం..అసలేమి జరిగిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook