Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు తప్పని చేదు అనుభవం..అసలేమి జరిగిందంటే..!

Pooja Hegde Tweet: ఇటీవల కాలంలో విమానాల్లో వీఐపీలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. తనిఖీలు,ఇతర కారణాలతో సెలబ్రెటీలను విమాన సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి అనుభవమే సినీ నటి పూజా హెగ్డేకు ఎదురైంది.  

Written by - Alla Swamy | Last Updated : Jun 9, 2022, 05:23 PM IST
  • సినీ నటి పూజా హెగ్డేకు మరో ఘోర అవమానం
  • విమాన సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని ట్వీట్
  • వైరల్‌గా మారిన ట్వీట్
Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు తప్పని చేదు అనుభవం..అసలేమి జరిగిందంటే..!

Pooja Hegde Tweet: సినీ నటి పూజా హెగ్డేకు మరో ఘోర అవమానం జరిగింది. ఇండిగో విమాన సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ట్వీట్ చేసింది. ముంబై నుంచి వస్తున్న ఇండిగో విమానంలో విపుల్ నకాషే అనే వ్యక్తి తనతో దురుసుగా ప్రవర్తించడని తెలిపింది. ఎలాంటి కారణం లేకుండానే అహంకారం, అజ్ఞానంతో మాట్లాడుతూ బెదిరించాడని పేర్కొంది. సాధారణం తాను ఇలాంటి ట్వీట్ చేయనని..కానీ ఈ ఘటన తనను ఎంతో బాధ పెట్టిందని ట్వీట్‌లో తెలిపింది.

హీరోయిన్ పూజా హెగ్డే పోస్ట్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై ఇండిగో వెంటనే స్పందించింది. విమానంలో ఇలాంటివి జరగడం దురదృష్టకరమని తెలిపింది. దీనిపై విచారణ చేస్తామని..బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

Also read:Women-Snake Relation: పాముతో కలిసి మహిళ జీవనం..ఏంటా కథ..ఎక్కడ జరిగింది..!

Also read:Nayanthara-Vignesh Wedding: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేష్‌! మండపంలో నయనతారకు ముద్దు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News