భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10మంది ఆసియన్ నేతలకు ఆహ్వానం పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణాసియాకి చెందిన పది దేశాల అధినేతలను ఆయన ఆహ్వానించారు. వారి గురించి మనం కూడా తెలుసుకుందామా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హున్ సేన్, కంబోడియా ప్రధానిమంత్రి - హున్ సేన్ 1985 నుండీ కంబోడియాకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రధానిగా కొనసాగిన వ్యక్తి కూడా హున్ సేన్ కావడం గమనార్హం. 2012లో తొలిసారిగా ఆయన భారత్ వచ్చారు. 2016లో భారత్‌తో ఆయన కంబోడియా తరఫున 153.13 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.



తొంగ్ లౌన్ సిసౌలిత్, లావో పీడీఆర్ - లావో పీడీఆర్ దేశానికి 2016 నుండి ప్రధానిగా వ్యవహరిస్తున్న ఈయన ఆ దేశ పీపుల్స్ రివల్యూషనరీ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ కూడా.  2016 లావో వేదికగా జరిగిన ఆసియన్ సదస్సులో ఆయనను తొలిసారిగా ప్రధాని కలిశారు. 



అంగ్ శాన్ స్యూకీ, స్టేట్ కౌన్సిలర్, మయన్మార్ - బర్మా లేదా మయన్మార్‌ దేశంలో నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ అధినేతైన స్యూకీ ఆ దేశ తొలి మహిళా విదేశాంగ మంత్రి కూడా. ఈమె తొలిసారిగా 2016లో భారత్‌ను సందర్శించారు. అయితే ఇటీవలే రొహింగ్యాల సమస్యల విషయంలో ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 



లీ హ్సీన్ లూంగ్, ప్రధానిమంత్రి, సింగపూర్ - లీ హ్సీన్ లూంగ్ 2004 నుండి సింగపూర్‌కు ప్రధానిమంత్రిగా వ్యవహరిస్తున్నారు. సింగపూర్ తొలి ప్రధాని లీ కుయాన్ యూకి పెద్ద కుమారుడే లీ హ్సీన్ లూంగ్. ప్రస్తుతం ఆసియాన్ (దక్షిణాసియా సమాఖ్య)కు ఈయన అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.



గూయన్ జ్గుయన్ ఫుక్, ప్రధానిమంత్రి, వియత్నాం - వియత్నాంకి ఈయన ఏడవ ప్రధానిమంత్రి. 1983లో ఈయన తొలిసారిగా వియత్నాం కమ్యూనిస్టు పార్టీలో మెంబరుగా చేరారు. 



హజీ హసనల్, సుల్తాన్ ఆఫ్ బ్రూనే - హజీ హసనల్ ప్రపంచంలోనే ధనవంతుడైన రాజుగా వార్తల్లోకెక్కారు. 2008లో తొలిసారిగా ఈయన భారత్ సందర్శించారు. బ్రూనే ప్రభుత్వంతో 2016 నాటికి భారత్ 494.54 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది



జోకో విడొడొ, ప్రెసిడెంట్, ఇండొనేషియా - ఇండోనేషియాకి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జోకో విడొడొ ఆ దేశానికి ఏడవ ప్రధానమంత్రి. ఆ దేశంలో మిలట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తొలి ప్రధాని కూడా జోకో విడొడొయే కావడం విశేషం. అలాగే ఇండోనేషియా భారత్‌కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా.



మహ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్, ప్రధానిమంత్రి, మలేషియా - ఈయన మలేషియాకి ఆరవ ప్రధాని. అలాగే యూనైటెడ్ మలైస్ నేషనల్ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్ కూడా. 2016లో భారత్‌తో మలేషియా 11.72 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం



రాడ్రిగో రువా డుటర్టే, ప్రెసిడెంట్, ఫిలిప్పీన్స్ - ఫిలిప్పీన్స్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఈయన ఆ దేశానికి 16వ అధ్యక్షుడు. 71 సంవత్సరాల రాడ్రిగో ఆ దేశంలో అత్యధిక వయసు గలిగిన తొలి ప్రెసిడెంట్. ఈయన తొలిసారిగా భారత్ వస్తున్నారు.



జనరల్ ప్రయూత్ చాన్ ఓ చా, ప్రధానిమంత్రి, థాయిలాండ్  - రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అయిన చాన్ ఓ చా ఆ దేశ శాంతి పరిరక్షణ దళానికి అధినేత కూడా. 2016లో తొలిసారిగా ఆయన భారత్ సందర్శించారు.