Dussehra Special Trains: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ఆ వివరాలు..!
Dussehra Special Trains: దసరా సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. స్పెషల్ ట్రైన్ల వివరాలను తెలుసుకుందాం..
Dussehra Special Trains: దసరా పండుగ సమీపిస్తోంది. దీంతో ప్రజలంతా స్వస్థలాలకు క్యూకడుతున్నారు. ఈనేపథ్యంలో రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. సికింద్రాబాద్, విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లను నడపనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి(02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది. ఈరైలు అక్టోబర్ 2న ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకోనుంది.
అదే రైలు(02763) తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2న సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి కదలనుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ రానుంది. ఈట్రైన్ జనగామ, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్లు, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణి గుంట స్టేషన్లలో ఆగనుంది. సికింద్రాబాద్-యశ్వంతపూర్(07233) రైలు సెప్టెంబర్ 29, అక్టోబర్ 6,13, 20 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి వెళ్లనుంది.
మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంతపూర్‌కు ప్రత్యేక రైలు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో ఈరైలు(07234) సెప్టెంబర్ 30, అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో సాయంత్రం 3.50 గంటలకు యశ్వంతపూర్‌లో ప్రారంభంకానుంది. మరుసటి రోజు సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ రానుంది. నరసాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్ నడవనుంది. ఈవిషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు.
నరసాపూర్-సికింద్రాబాద్(07466) రైలు ఈనెల 30న సాయంత్రం 6 గంటలకు నరసాపూర్ నుంచి బయలు దేరనుంది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న తెల్లవారుజామున 4.10 గంటలకు సికింద్రాబాద్ రానుంది. సికింద్రాబాద్-నరసాపూర్(07467) ట్రైన్ అక్టోబర్ 1న సికింద్రాబాద్‌లో రాత్రి 9.05 గంటలకు కదలనుంది. మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈట్రైన్ పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌ల మీదుగా వెళ్లనుంది.
స్పెషల్ ట్రైన్స్ లిస్ట్..!
* సికింద్రాబాద్-తిరుపతి(02764) రైలు
* తిరుపతి-సికింద్రాబాద్ రైలు(02763
* సికింద్రాబాద్-యశ్వంతపూర్(07233) రైలు
* యశ్వంతపూర్-సికింద్రాబాద్ రైలు(07234
* నరసాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు స్పెషల్ ట్రైన్
* నరసాపూర్-సికింద్రాబాద్(07466) రైలు
* సికింద్రాబాద్-నరసాపూర్(07467)
Also read:Union Govt: ఏపీలో మరో కొత్త జాతీయ రహదారి..విజయవాడ నుంచి ఎక్కడి వరకో తెలుసా..?
Also read:Minister Peddireddy: ఏపీలో వ్యవసాయ కనెక్షన్‌లకు స్మార్ట్ మీటర్లు..మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి